Telangana: ఎన్నికల ఏడాది.. ప్రచారం కోసం వెయ్యి కోట్లు

Telangana: ఎన్నికల ఏడాది.. ప్రచారం కోసం వెయ్యి కోట్లు
Telangana: ఎన్నికల ఏడాది కారణంగా సీఎం కేసీఆర్‌... ప్రచారానికి పెద్దపీట వేయనున్నారా? అడిగిన వారికి లేదనకుండా ఇక వరాల జల్లులు కురిపిస్తారా?

Telangana: ఎన్నికల ఏడాది కారణంగా సీఎం కేసీఆర్‌... ప్రచారానికి పెద్దపీట వేయనున్నారా? అడిగిన వారికి లేదనకుండా ఇక వరాల జల్లులు కురిపిస్తారా? రాబోయే రోజుల్లో ఈ హామీల తుపాను కొనసాగుతుందా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలు వస్తున్నాయి.

తన విచక్షణాధికారాల మేరకు ప్రకటించే ప్రత్యేక అభివృద్ధి నిధికి భారీగా నిధులు కేటాయించడం, పత్రికలు, చానెళ్లలో ప్రకటనల కోసం సమాచారా శాఖకు ఏకంగా వెయ్యి కోట్లు కేటాయించడమే దీనికి నిదర్శనం. ప్రత్యేక అభివద్ధి నిధికి గత బడ్జెట్లో కేవలం 2 వేల కోట్లే కేటాయించగా.. ఈసారి ఏకంగా ఐదు రెట్లు పెంచే 10 వేల 348 కోట్లు కేటాయించారు.....

ఎన్నికల నేపథ్యంలో సీఎం ఎక్కడికి వెళితే అక్కడ వరాల జల్లులు కురిపించే అవకాశం ఉందంటున్నారు. ఎస్డీఎఫ్‌ కింద నిధుల కేటాయింపునకు ఎలాంటి నిబంధనలూ ఉండవు. దేనికైనా నిధులను కేటాయించేందుకు సీఎంకు విచక్షణాధికారాలుంటాయి.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు నియోజకవర్గాల్లోని భవనాలు, రోడ్ల నిర్మాణానికి కూడా కేటాయించవచ్చు. అందుకే, దీని కింద చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఉంటారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఎస్‌డీఎఫ్‌కు భారీగా నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది.

ఇక... నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం - సీడీపీ కింద 800 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో కూడా ఇంతే మొత్తాన్ని కేటాయించినా.. పెద్దగా విడుదల చేయలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసారి విడుదల చేయవచ్చన్న చర్చ జరుగుతోంది.

ఇక.. సమాచార శాఖకు చాలా తక్కువ నిధులు కేటాయించేవారు. గత ఏడాది కూడా కేవలం 148 కోట్లే కేటాయించారు. కానీ ఈసారి ఈ శాఖకు ఏకంగా వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాల ప్రచారమే దీనికి కారణమంటున్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పథకాలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తున్నారని.... ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలను ఇస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఏ రాష్ట్రానికి వెళితే.. ఆ రాష్ట్రంలోని స్థానిక పత్రికలు, చానెళ్లకు కోట్ల రూపాయల ప్రకటనలను ఇస్తున్నారంటూ ఫైర్‌ అవుతున్నారు.

గతంలో ఝార్ఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు అక్కడ పెద్ద మొత్తంలో ప్రకటనలు జారీ చేశారని, పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. 2014 నుంచి 2018 వరకు ప్రకటనల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.300 కోట్లను వెచ్చించిందని ఆర్టీఐ కింద పొందిన సమాచారం మేరకు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ బయటపెట్టింది. ఇప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో కేవలం ప్రచారం కోసమే వెయ్యి కోట్లను కేటాయించడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story