పంట పెట్టుబడి కోసం రైతు భరోసా : సీఎం రేవంత్ రెడ్డి

పంట పెట్టుబడి కోసం రైతు భరోసా : సీఎం రేవంత్ రెడ్డి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బీఆర్‌ఎస్‌ పార్టీని (BRS Party) తరిమికొడతామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో (Hyderabad LBNagar Stadium) జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ (KCR), కేటీఆర్‌లపై (KTR) మండిపడ్డారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోయిందని... వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా బహిష్కరిస్తామని చెప్పారు. పులి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని... పులి వస్తే బోనులో వేసి చంపేస్తామని ఘాటుగా అన్నారు. కేసీఆర్‌ కాస్కో అంటూ సవాల్‌ చేశారు.

రేవంత్ రెడ్డి తాపీ మేస్త్రిలా ఉన్నాడని బీఆర్ఎస్ నాయకులు విమర్సించారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ అవును తాపీ మేస్త్రీ... తెలంగాణను పునర్నిర్మించే తాపీ మేస్త్రీ ని నేను అని కౌంటర్ ఇచ్చారు. గతంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడితే... నేడు పారదర్శకంగా టీఎస్ పీఎస్సీలో నియామకాలు చేపట్టామన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచి శంఖారావాన్ని పూర్తి చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని చిత్తు చేయడం ఖాయమన్నారు. వెడ్మ బొజ్జు లాంటి వాళ్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని... అదే బీఆర్ఎస్ పార్టీ వ్యాపారవేత్తలను రాజ్యసభ సభ్యులుగా నియమించిందని దుయ్యబట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని... రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కనీసం 14 సీట్లైనా గెలవాలని ఎంపీలను కోరారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువద్దాం.. మోదీని ఓడించాలి.. రాహుల్‌ను ప్రధానిని చేయాలి.. కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. కార్యకర్తల కృషి వల్లే.. ఇంత గౌరవప్రదమైన స్థానం సాధించాను అని చెప్పారు. రాహుల్ పాదయాత్రతో మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం.. నెహ్రూ కుటుంబం త్యాగాలతోనే దేశం అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా పంట పెట్టుబడి సాయంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోపు రైతు భరోసా (రైతుబంధు) ద్వారా నగదు అందజేస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 హామీలను అమలు చేస్తామన్నారు. 100 రోజుల వ్యవధిలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు.

కార్యకర్తల కృషి వల్లే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఆరు హామీల్లో రెండింటిని అమలు చేశామని, త్వరలో మరో రెండు హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈసారి మోడీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారా? అని అడిగారు. నల్లధనం తెస్తానన్నాడు... తెచ్చాడా...? అని వారు చెప్పారు. రాహుల్ యాత్ర విజయవంతంగా సాగుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో ఎంపీలను గెలిపించేలా కృషి చేయాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story