Shamshabad: శంషాబాద్ డీసీపీ ఆఫీస్‌ పక్కన అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన వాహనాలు..

Shamshabad: శంషాబాద్ డీసీపీ ఆఫీస్‌ పక్కన అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన వాహనాలు..
Shamshabad: శంషాబాద్ డీసీపీ కార్యాలయం పక్కన అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

Shamshabad: శంషాబాద్ డీసీపీ కార్యాలయం పక్కన అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో డీసీపీ ఆఫీసు పక్కన పార్కింగ్ చేసిన పలు రికవరీ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో రెండు కార్లు ఓ ట్రాక్టర్‌తో పాటు ఓ బైక్ పూర్తిగా తగలబడి పోయాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు పక్కనే ఉన్న మిగతా వాహనాలను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

శంషాబాద్ పరిధిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాహనాలను డీసీపీ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశారు. ఐతే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగి పలు వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటన్నది అంతుబట్టడం లేదు. ఎవరైనా కావాలని తగలబెట్టారా లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story