Top

హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుంది : మురళీధర్ రావు

హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుంది : మురళీధర్ రావు
X

టీఆర్‌ఎస్ మేనిఫెస్టో రీ సైకిల్డ్‌ కాపీ అన్నారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను డస్ట్ బిన్ కాపీగా అభివర్ణిస్తూ... చెత్త డబ్బాలో వేశారు. టీఆర్‌ఎస్ ను హైదరాబాద్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్.. పాత బస్తీలో ఓట్‌ కట్టర్ పార్టీగా మారిందన్నారు. బీహార్‌ ఎన్నికల్లో గెలిచిన MIM ఎమ్మెల్యే.. హిందుస్తాన్‌ పేరుతో ప్రమాణస్వీకారం చేయనని చెప్పిన విషయాన్ని మురళీధర్ రావు గుర్తు చేశారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో 30 ఏళ్లుగా గెలుస్తాన్నామని.. బీజేపీ గెలిచిన చోట మతవిద్వేషాలు లేవన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదన్నారు మురళీధర్ రావు.


Next Story

RELATED STORIES