Top

హైదరాబాద్ ప్రజలకు టీఆర్‌ఎస్‌ చేసిందేమిలేదు : రేవంత్‌

హైదరాబాద్ ప్రజలకు టీఆర్‌ఎస్‌ చేసిందేమిలేదు : రేవంత్‌
X

తెలంగాణ ఏర్పడిన తర్వాత విధ్వంస పాలన సాగుతోందని.. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొన్ని వందల ఏళ్ల క్రితమే నిజాం పాలకులు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ వల్లే మెట్రో వ్యయం పెరిగిందని.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ద ప్రెస్‌లో అన్నారు. 67 వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామనడం పచ్చి అబద్ధమన్నారు. 6 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను తమ ఖర్చుల్లో కలిపి చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ ప్రజలకు టీఆర్ఎస్‌ చేసిందేమి లేదన్నారు.


Next Story

RELATED STORIES