టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై మాటల యుద్ధం

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై మాటల యుద్ధం

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై బీజేపీ విమర్శలు గుప్పించింది. సీఎం కేసీఆర్‌ మేనిఫెస్టో ప్రకటించిన వెంటనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అందులో లోపాలున్నాయంటూ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో కొత్తదనమేమి లేదన్నారాయన. గత ఎన్నికల హామీలనే మళ్లీ ప్రకటించారని ఆరోపించారు. కనీసం పేజీలు, ఫొటోలు కూడా మారలేదన్నారు కిషన్‌రెడ్డి.

హైదరాబాద్‌ విశ్వనగరం చేస్తామని.. విషాద నగరంగా మార్చారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. వరదలతో 40 మంది చనిపోయారని.. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. అలాంటప్పుడు ఇది విశ్వనగరం ఎలా అవుతుందో చెప్పాలని టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు.

అటు బీజేపీ నేతల విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. హైదరాబాద్‌కు రూపాయి ఇవ్వని కేంద్రంలోని బీజేపీకి.. టీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. కేంద్రం హైదరాబాద్‌కు అరపైసా ఇచ్చిందో లేదో కిషన్‌రెడ్డిని ప్రజలు నిలదీయాలన్నారు. గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఇరు పార్టీల నేతల పరస్పర విమర్శలతో గ్రేటర్‌ రాజకీయం వేడెక్కింది.



Tags

Read MoreRead Less
Next Story