అక్బరుద్దీన్ ఒవైసీ రజాకార్ల ప్రతినిధిలా మాట్లాడారు: ఎల్.రమణ

X
Nagesh Swarna26 Nov 2020 12:42 PM GMT
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీ నేతలు... ప్రజల సమస్యలు విస్మరించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. ఓట్లు అడిగేందుకు మొహం చెల్లక.. కొత్త ప్రయోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్బరుద్దీన్ ఒవైసీ రజాకార్ల ప్రతినిధిలా మాట్లాడారని అన్నారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్ అంటే మరొకరు ఘాట్‌ల కూల్చివేతపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం నేర చరితులకు టికెట్లు ఇచ్చాయని విమర్శించారు.
Next Story