GHMC: అలా చేస్తే లక్ష రూపాయల జరిమానా: జీహెచ్ఎంసీ వార్నింగ్

GHMC: అలా చేస్తే లక్ష రూపాయల జరిమానా: జీహెచ్ఎంసీ వార్నింగ్
అసలే హైదరాబాద్ రోడ్లు అంతంత మాత్రం.. నాలుగు చినుకులు పడితే ఎక్కడ డ్రైనేజీ ఉందో ఎక్కడ రోడ్డు ఉందో తెలుసుకోలేని పరిస్థితి.

GHMC: అసలే హైదరాబాద్ రోడ్లు అంతంత మాత్రం.. నాలుగు చినుకులు పడితే ఎక్కడ డ్రైనేజీ ఉందో ఎక్కడ రోడ్డు ఉందో తెలుసుకోలేని పరిస్థితి. దీనికి తోడు భవన నిర్మాణానికి సంబంధించిన వ్యర్దాలు కూడా రోడ్ల పైన వేస్తే యాక్సిడెంట్స్ కాక ఏమవుతాయి.. అదే విషయంపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది.. ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు తప్పవంటోంది.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సినీ హీరో సాయిథరమ్ తేజ్ యాక్సిడెంట్ నేపథ్యాన్ని సీరియస్‌గా తీసుకుంది.

ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు రోడ్లపై వ్యర్థాలు వేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాలు విధించాలనుకుంటోంది. దీనిలో భాగంగానే నగరంలోని మాదాపూర్ ఖానామెట్ అరబిందో కన్‌స్ట్రక్షన్ కంపెనీకి జీహెచ్ఎంసీ అధికారులు లక్ష రూపాయలు జరిమానా విధించారు. భవన నిర్మాణ సమయంలో రోడ్లపైకి చెత్త, ఇసుక, నిర్మాణ వ్యర్ధాలు రాకుండా నిర్మాణ దారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story