దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ హవా..

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ హవా..
ఎంబీబీఎస్ సీట్ల పెంపులో తెలంగాణ సర్కారు మరో కీలక మైలురాయిని అందుకుంది.

ఎంబీబీఎస్ సీట్ల పెంపులో తెలంగాణ సర్కారు మరో కీలక మైలురాయిని అందుకుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణకు చెందినవే అని తెలిపారు. ఈ మేరకు మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ విభాగంలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 2,118 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 900 సీట్లు తెలంగాణకు చెందిన వైద్య కళాశాలలకు చెందినవే ఉన్నాయి.ఆరోగ్య తెలంగాణ లక్ష్యం దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మిగతా వైద్య కళాశాలలకూ అనుమతులు వస్తే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి ట్వీట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story