రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి హరీష్
ఖమ్మంలో రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి హరీష్. ఆయనకు విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్సేదేనన్నారు. అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీదని అందుకే స్కాంగ్రెస్‌గా మారిందంటూ ఎద్దేవా చేశారు. అందువల్లే దేశ ప్రజలు అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీం కాదన్న ఆయన తమది పేద ప్రజలకు ఏ టీం అన్నారు. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం అన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్ పుట్టిందన్నారు. రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా. అంటూ ప్రశ్నించారు. తాము పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది అని ఎద్దేవా చేశారు. అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అంటూ విమర్శించారు మంత్రి హరీష్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com