HDFC : కస్టమర్ వద్దన్నా క్రెడిట్ కార్డు.. బ్యాంకుకు భారీ జరిమానా..

HDFC : కస్టమర్ వద్దన్నా క్రెడిట్ కార్డు.. బ్యాంకుకు భారీ జరిమానా..
HDFC :వద్దంటే కూడా అంట గడుతుంటాయి కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డులు.. క్రెడిట్ కార్డు ఉన్నా అది అప్పుతో సమానమే అని భావించి వాటి జోలికి వెళ్లడానికి ఇష్టపడరు చాలా మంది.

HDFC: వద్దంటే కూడా అంట గడుతుంటాయి కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డులు.. క్రెడిట్ కార్డు ఉన్నా అది అప్పుతో సమానమే అని భావించి వాటి జోలికి వెళ్లడానికి ఇష్టపడరు చాలా మంది. ఓ కస్టమర్ ఇంటికి అప్లై చేయకున్నా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి క్రెడిట్ రావడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇదే పెద్ద షాకనుకుంటే అంత కంటే పెద్ద షాక్ అతని అకౌంట్ నుంచి రూ.33,493 కట్ చేసి హెల్త్ ఇన్యూరెన్స్ కూడా అప్లై చేసింది. తన అంగీకారం లేకుండా క్రెడిట్ కార్డు, ఆరోగ్య బీమా పాలసీలు ఎలా ఇస్తారని సదరు కస్టమర్ అడిగిని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు బ్యాంకు అధికారులు. దీంతో అతడు వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. ఫోరమ్ పరిశీలించిన పిమ్మట బ్యాంకుకు భారీ జరిమానా విధించింది.

కోఠీలో నివసిస్తున్న వెంకటయ్య ప్రైవేటు ఉద్యోగి. మూడేళ్ల క్రితం హెచ్‌డీఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్ వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని వెంకటయ్యను కోరారు. దీనికి వెంకటయ్య నిరాకరించాడు. దీంతో క్రెడిట్ కార్డు జిరాక్స్ తీసుకొని అతనికి తెలియకుండానే 2020 సెప్టెంబర్‌లో ఆరోగ్య పాలసీకి అప్లై చేశాడు. ఇందుకోసం అతడి ఖాతా నుంచి రూ.1560 విత్ డ్రా జరిగింది. దీనిపై బ్యాంకు వారికి ఫిర్యాదు చేయడంతో పాటు క్రెడిట్ కార్డును కూడా క్లోజ్ చేశారు వెంకటయ్య. అయితే కొద్ది రోజుల్లోనే మరో క్రెడిట్ కార్డు అతడి ఇంటికి వచ్చింది. ఆరోగ్య బీమా పాలసీ అంటూ అకౌంట్ నుంచి రూ.33,493 విత్ డ్రా చేసింది బ్యాంకు. వెంకటయ్య తాను ఎటువంటి పాలసీ తీసుకోకుండా ఆ విధంగా ఎలా చేస్తారు అని బ్యాంకుకు మళ్లీ ఫిర్యాదు చేశారు. కానీ అతడికి సరైన సమాధానం రాలేదు. దీంతో బాధితుడు హైదరాబాద్ వినియోగదారుల కమీషన్‌లో ఫిర్యాదు చేశారు. కమిషన్ అధ్యక్షురాలు బి. ఉమావెంకట సుబ్బలక్ష్మి డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసి వివరాలను పరిశీలించింది. వినియోగదారుడికి 9శాతం వడ్డీతో కలిపి రూ.33,493 చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే రూ.10వేల జరిమానాతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.10వేలు చెల్లించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story