జొమాటోలో ఫుడ్ ఆర్డర్.. బావర్చి బిర్యానీలో చచ్చిన బల్లి..

జొమాటోలో ఫుడ్ ఆర్డర్.. బావర్చి బిర్యానీలో చచ్చిన బల్లి..
బాబోయ్.. ఏదో ఒక టైమ్ లో బయట ఫుడ్ తినకతప్పదు. ఇలాంటి వార్తలు చూస్తుంటే భయం వేస్తుంది

భగవంతుడా.. ఏదో ఒక టైమ్ లో బయట ఫుడ్ తినకతప్పదు. ఇలాంటి వార్తలు చూస్తుంటే భయం వేస్తుంది. అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారో.. వీధికో రెస్టారెంటు, విచ్చలవిడిగా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్లు.. దీంతో వారి బిజినెస్ వారికి వచ్చేస్తుంది. శుభ్రత పట్ట శ్రద్ద కొరవడుతోంది. ఫుడ్ సేప్టీ తనిఖీలు కూడా అంతంత మాత్రమే. దాంతో రెచ్చిపోతున్న రెస్టారెంట్ యాజమాన్యం అందినకాడికి దండుకుంటూ అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నాయే తప్ప కస్టమర్ కి అందించే ఫుడ్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు.

ఈ రోజు వంట ఏం చేస్తాం లే.. జొమాటోలో ఆర్డర్ పెడితే నిమిషాల్లో వేడి వేడి బిర్యానీ వచ్చేస్తుంది అని ఆలోచించే వారే మహానగరాల్లో ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీలో చనిపోయిన బల్లిని గుర్తించి జొమాటోకు ఫిర్యాదు చేశాడు. X లో చేసిన పోస్ట్ ప్రకారం, జొమాటో డెలివరీ చేసే వ్యక్తి చికెన్ బిర్యానీని మాత్రమే కాకుండా, ఒక చచ్చిపోయిన బల్లిని కూడా తీసుకొచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ద్వారా స్థానిక రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ ప్యాకెట్‌లో చనిపోయిన బల్లిని గుర్తించిన హైదరాబాద్‌లోని ఒక కుటుంబం భయాందోళనకు గురయ్యింది. అంబర్‌పేట్‌లోని డీడీ కాలనీకి చెందిన విశ్వ ఆదిత్య చికెన్ బిర్యానీ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన షాకింగ్ సంఘటన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని బావర్చి హోటల్‌లో చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బావర్చి యాజమాన్యం నిర్లక్ష్యాన్ని హైలైట్ చేసింది. జొమాటో కేర్ పోస్ట్‌పై స్పందిస్తూ, "మేము సమస్యను గుర్తించాము. కస్టమర్‌తో మాట్లాడాము. మేము దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నాము. తదుపరి చర్యలకు కృషి చేస్తున్నాము" అని పేర్కొంది. ఈ సంఘటన ఫుడ్ డెలివరీల కోసం నాణ్యతా నియంత్రణ చర్యలు, రెస్టారెంట్లు, డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యత గురించి ఆందోళనలను రేకెత్తించింది.

Tags

Read MoreRead Less
Next Story