ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదు : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం

ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదు : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. EVM, వీవీప్యాట్‌ల ద్వారా ఎలక్షన్లు..

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. EVM, వీవీప్యాట్‌ల ద్వారా ఎలక్షన్లు నిర్వహిస్తే సిబ్బందికి శిక్షణ ఇవ్వల్సి ఉంటుంది. అంతేకాదు..అందరూ ఒకే ఈవీఎంను ఉపయోగించడం వల్ల కొవిడ్ వైరస్ సంక్రమించే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పాత విధానమైన బ్యాలెట్‌వైపే SEC మొగ్గుచూపింది..గ్రేటర్ ఎన్నికలు ఎలా నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం పలు మార్లు రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసింది. మొత్తం 50 పార్టీలు ఉండగా అందులో 26 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఇందులో 16 పార్టీలు బ్యాలెట్ , 3 పార్టీలు ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరాయి.

గుర్తింపు పొందిన పార్టీల్లో ఒక్క BJP పార్టీ మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. అధికార TRSతో పాటు మరో 4 గుర్తింపు పొందిన పార్టీలు బ్యాలెట్ విధానానికే జై కొట్టాయి. 2009, 2016లో ఈవీఎంల ద్వారానే GHMCఎన్నికలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి, మెజార్టీ పార్టీల అభిప్రాయల మేరకు ఈసారి బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు జరపాలని నిర్ణయంచారు. గతంలో గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, 2020 జనవరిలో జరిగిన పురపాలక సంఘాల ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయి. జీహెచ్ఎంసీతో పాటు వరంగల్ ఇతర కార్పొరేషన్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story