MLA : జెంటిల్‌మన్ స్టైల్లో కామారెడ్డి ఎమ్మెల్యే కంప్లయింట్ బాక్స్

MLA : జెంటిల్‌మన్ స్టైల్లో కామారెడ్డి ఎమ్మెల్యే కంప్లయింట్ బాక్స్

కామారెడ్డి అసెంబ్లీ (KamaReddy Assembly) అంటే తెలంగాణలో ఓ హిస్టరీ. ఆ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్థాయి అభ్యర్థులైన రేవంత్‌ రెడ్డి (Revanth Reddy), కేసీఆర్‌లపై (KCR) సంచలన విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (BJP MLA Kaataipalli Venkata Ramana Reddy) తన స్టైల్ ఏంటో మరోసారి రుజువు చేశారు. కొత్త నిర్ణయం తీసుకున్నారు.

ప్రజల కష్టాలను తీర్చే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా సమస్యలపై నియోజకవర్గం అంతటా ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫిర్యాదు బాక్స్‌ను ఎమ్మెల్యే స్వయంగా ఆవిష్కరించారు. అన్ని గ్రామాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని, నేరుగా తానే వచ్చి ఫిర్యాదులు స్వీకరిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దానిపై ఫిర్యాదుదారు పేరు, ఫోన్‌ నంబర్‌ రాయాలని.. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

రోడ్డు విస్తరణ కోసం ఎమ్మెల్యే తన సొంత ఇంటిని కూల్చివేసిన విషయం ఇప్పటికే స్టేట్ వైడ్ గా వైరల్ అయింది. కామారెడ్డి పట్టణంలోని పాత మాస్టర్‌ప్లాన్‌లో పాత బస్టాండ్‌ నుంచి పంచముఖి హనుమాన్‌ దేవాలయం మీదుగా రైల్వేగేటు వరకు రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్తరించారు. ఆక్రమణల కారణంగా 34 అడుగులకు తగ్గింది. దీంతో నిత్యం రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నందున రోడ్డును రీడిజైన్ చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించి రోడ్డు విస్తరణకు ప్రణాళిక రూపొందించారు.

కామారెడ్డిలో తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని స్థానికులు, మున్సిపల్, రోడ్డు భవనాల శాఖ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే కూల్చివేశారు. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం రోడ్ల విస్తరణ చేపట్టనప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే సంకల్పంతో కూల్చివేసినట్లు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెల్లడించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్ల విస్తరణకు సహకరించాలని పిలుపునిచ్చారు. వెయ్యి గజాలకు పైగా ఉన్న స్థలాన్ని రోడ్లు భవనాల శాఖకు అప్పగిస్తున్నామని, దీని విలువ రూ.6 కోట్లకుపైగా ఉంటుందని ప్రకటించారు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story