KCR: నేనొస్తున్నా అంటున్న కేసీఆర్

KCR: నేనొస్తున్నా అంటున్న కేసీఆర్

BRS అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన, ఆ పార్టీ ఎంపీలు ఎర్రవెల్లిలో సమావేశమయ్యారు. ఈ నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు బదిలీ చేయడంపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఉధృతంగా పోరాడాలని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ ఎంపీలు రెండు సభల్లో సందడి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని... త్వరలోనే తాను కూడా ప్రజల్లోకి వస్తానని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్ఎస్ పార్టీ అని... రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని ఆదేశించారు.

నదీజలాల కేటాయింపు, ఉమ్మడి ఆస్తుల బదలాయింపుతోపాటు రాష్ట్ర విభజనపై పెండింగ్‌లో ఉన్న హామీల అమలు కోసం పోరాడిన చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ హక్కులను మరోసారి కాపాడాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ ఎంపీలపైనే ఉందని స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్లమెంటేరియన్లకు దిశానిర్దేశం చేయడంతోపాటు పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

రాజ్యసభ (Rajya Sabha), లోక్‌సభ (Lok Sabha) పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశరావు (k.kesharao), నామా నాగేశ్వర్‌రావుతో (Naamaa Nageswarrao) పాటు పార్టీ ఎంపీలు పోతుగంటి రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వావిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి . రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

ఈ భేటీ అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. కృష్ణా రివర్ (Krishna River) బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించి సంతకాలు చేసిందన్నారు. ఇందుకు సంబంధించి మినిట్స్‌ను కూడా కేంద్రం విడుదల చేసిందని గుర్తు చేశారు.

కృష్ణా జలాల్లో (Krishna District) మన వాటా తేలకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తాం? ఇప్పుడు తెలంగాణ అధికారులు ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం లేదు. మరోవైపు మేం సంతకం చేయలేదని రాష్ట్ర మంత్రి చెబుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైంది. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ బృందం కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలవనున్నట్లు చెప్పారు. తెలంగాణకు గతంలో బీజేపీ (BJP), కాంగ్రెస్ పార్టీలు (Congress Party) అన్యాయం చేశాయన్నారు. పార్లమెంటు లో తన వాణిని వినిపిస్తుందని వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు హామీలు నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story