KCR: UCC కి బీఆర్ఎస్‌ పార్టీ వ్యతిరేకం..

KCR: UCC కి బీఆర్ఎస్‌ పార్టీ వ్యతిరేకం..

యూనిఫాం సివిల్‌ కోడ్‌ బిల్లుకు బీఆర్ఎస్‌ పార్టీ వ్యతిరేకమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. UCC వల్ల అన్ని మతాల వారిలో అయోమయం ఉందన్నారు ఆయన. బీజేపీ దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. యూనిఫాం​సివిల్​కోడ్​పేరుతో ప్రజలను విభజించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన అసదుద్దీన్‌ ఓవైసీ, ముస్లీం మతపెద్దలు పలు అంశాలపై చర్చించారు.

UCCని వ్యతిరేకించాలని ముస్లిం మతపెద్దలు కేసీఆర్‌కు వినతి పత్రం ఇచ్చారు. దీనికి కేసీఆర్‌ సానుకూలంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. UCCతో ప్రత్యేక సంస్కృతి కలిగిన అన్ని జాతులు, మతాలకు ఇబ్బందని స్పష్టం చేశారు. భారత్‌.. భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఆదర్శంగా నిలిచిన భారతీయుల ఐక్యతను చీల్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న UCC బిల్లుపై సీఎం కేసీఆర్‌తో చర్చించామన్నారు అసదుద్దీన్‌ ఓవైసీ. UCC బిల్లును వ్యతిరేకించాలని కోరినట్లు తెలిపారు. యూనిఫాం సివిల్​కోడ్​ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు ఆయన. UCC పేరిట లౌకిక వాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. కేవలం ఇది ముస్లింల అంశం కాదని.. క్రైస్తవులు, గిరిజనులు, హిందువులకు కూడా మంచిది కాదన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిసున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story