తెలంగాణ

KCR: చినజీయర్‌ ఆశ్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్..

KCR: హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు.

KCR: చినజీయర్‌ ఆశ్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్..
X

KCR: హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. సీఎం రాక సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు వేదపండితులు. తర్వాత చినజీయర్ స్వామికి కేసీఆర్‌ సాష్టాంగ నమస్కారం చేశారు. భగవత్ రామానుజచార్య ప్రాజెక్ట్ విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు.

రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఆశ్రమంలో ఒక మొక్కను నాటారు. ఆశ్రమ విశేషాలపై మాటల తర్వాత.. యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణ పనుల విషయంతోపాటు మరికొన్ని అంశాలపై చినజీయర్ స్వామితో మాట్లాడారు కేసీఆర్‌. తర్వాత పాకశాలలో భోజనం చేసి, చినజీయర్‌తో కలిసి యాదాద్రి పర్యటనకు వెళ్లారు.

దాదాపు అక్కడ పనులన్నీ పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ముహూర్త నిర్ణయం, వాస్తుపరంగా చేయాల్సిన మార్పులు చేర్పుల్లాంటివి ఏమైనా ఉంటే వాటికి తగ్గట్టు స్వామీజీ చేసే సూచనల్ని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES