తెలంగాణ

అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి : కేటీఆర్‌

అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి : కేటీఆర్‌
X

హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో కేటీఆర్‌ రోడ్‌ షోలు నిర్వహించారు. నర్సాపూర్‌ క్రాస్‌రోడ్డులో నిర్వహించిన రోడ్‌ షోలో.. బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో ‌హైదరాబాద్‌లో 67వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌కు కేంద్రం ఏం చేసిందో కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Next Story

RELATED STORIES