Top

వరద బాధితులకు బండి సంజయ్‌ రూ.25 వేలు ఇస్తామనడం విడ్డూరం : కేటీఆర్‌

వరద బాధితులకు బండి సంజయ్‌ రూ.25 వేలు ఇస్తామనడం విడ్డూరం : కేటీఆర్‌
X

ఓట్ల కోసం బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరని మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తే బీజేపీ నేతలే ఆపారని.. కానీ అడ్డుకున్న బండి సంజయ్‌ ఇప్పుడు రూ.25 వేలు ఇస్తామనడం విడ్డూరమన్నారు. GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌, మూసాపేట్‌ డివిజన్ల టీఆర్‌ఎస్‌ కార్పొరేట్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో బీజేపీ తీరుపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు.

అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా కేటీఆర్‌ కోరారు. హైదరబాద్‌ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎన్నో పనులు చేపట్టారని గుర్తు చేశారు. మరి ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్కపనైనా చేసిందా అని ప్రశ్నించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో బీజేపీ నేతలు నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్‌లో అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నరని మండిపడ్డారు.

Next Story

RELATED STORIES