లంకె బిందెలో 5 కేజీల బంగారం.. అదృష్టంగా భావిస్తున్న గ్రామస్తులు

లంకె బిందెలో 5 కేజీల బంగారం.. అదృష్టంగా భావిస్తున్న గ్రామస్తులు
లంకె బిందెల గురించి తరచూ వింటూనే ఉంటాం. అయితే జనగాం జిల్లాలో నిజంగానే ఓ లంకె బిందె బటయపడింది. అందులో ఏకంగా 5 కేజీల బంగారం ఉండడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

లంకె బిందెల గురించి తరచూ వింటూనే ఉంటాం. అయితే జనగాం జిల్లాలో నిజంగానే ఓ లంకె బిందె బటయపడింది. అందులో ఏకంగా 5 కేజీల బంగారం ఉండడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ బంగారాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ లంకెబిందె ఏ కాలం నాటిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జనగామ జిల్లా కేంద్రం పరిధిలోని పెంబర్తి గ్రామ శివార్లలో నర్సింహా అనే వ్యక్తికి ఈ లంకెబిందె దొరికింది. వెంచర్ వేయడానికి నర్సింహా 11 ఎకరాల భూమిలో నెలరోజుల నుంచి జేసీబీతో చదును చేయిస్తున్నాడు. ఒక చోట బండరాళ్లను తవ్వుతుంటే వాటి కింద లంకె బిందె బయటపడింది.

దాన్ని తెరిచి చూస్తే అందులో 5 కిలోల బంగారం, ఇతర పురాతన వస్తువులు ఉండడం చూసి ఆశ్చర్యపోయిన నర్సింహా... వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. దీంతో పోలీసులతోపాటు పురావస్తు శాఖ అధికారులు స్పాట్‌కు చేరుకుని బంగారాన్ని, వస్తువులను పరిశీలించారు.

మరోవైపు లంకె బిందె దొరకడాన్ని గ్రామస్థులు అదృష్టంగా భావిస్తున్నారు. అందుకే అక్కడ గుడి కట్టాలని నిర్ణయించారు.

Also Read :

1. "కుడి భుజం మీద టీకా".. సారంగ‌ద‌రియా'పై పేర‌డి సాంగ్ వచ్చేసింది...!

2. డైరెక్టర్ తేజకి మరో ఉదయ్‌కిరణ్‌ దొరికేశాడు..!

3. ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ.. అందుకే రిజెక్ట్ చేశా: అనసూయ

Tags

Read MoreRead Less
Next Story