Telangana: చట్నీలో బల్లి.. 12మంది హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థత

Telangana: చట్నీలో బల్లి.. 12మంది హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థత
Telangana: జనగాం జిల్లా దేవరుప్పుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కెజిబివి) దోసకాయ చట్నీ తిన్న సుమారు 12 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.

Telangana: జనగాం జిల్లా దేవరుప్పుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కెజిబివి) దోసకాయ చట్నీ తిన్న సుమారు 12 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆహారంలో బల్లి అవశేషాలు కనిపించాయి.

బాలికలను చికిత్స నిమిత్తం జనగాం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు కడుపునొప్పితో వాంతులు అవుతున్నాయని వార్డెన్‌కు సమాచారం అందించారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు.

చట్నీని తిన్న విద్యార్థులు మొదట్లో అందులో మాంసం లేదా చేపలు కలిపి చేశారేమో అని అనుకున్నారు. కొద్దిసేపటి తరువాత, వారు బల్లికి సంబంధించిన అవశేషాలను చూశారు. దాంతో వారికి ఒక్కసారిగా వికారం పుట్టి కడుపులో దేవేసినట్లు అయింది.

పాఠశాలకు వెళ్లి క్షుణ్ణంగా రోగ నిర్ధారణ చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివ లింగయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని తమ కుమార్తెల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ''ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం.. హాస్టల్ నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించాం.

మెస్ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని లింగయ్య తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పనుల్లో ఉన్న సమయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ దయాకర్ రావు కూడా ఘటనపై ఆరా తీశారు.

Tags

Read MoreRead Less
Next Story