Top

బీసీల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల : గంగుల కమలాకర్

బీసీల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి గంగుల కమలాకర్. తన గురించి అతిగా ఊహించుకుంటున్న ఈటల.

బీసీల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల : గంగుల కమలాకర్
X

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన ఈటల ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఈటలకు సీఎం కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారన్న ఆయన.. ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతినిందో చెప్పాలన్నారు. అసైన్డ్ భూములు కొనవద్దని చట్టం చెబుతున్నా మంత్రిగా ఈటల ఆ భూములను ఎలా కొన్నారని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.

బీసీల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి గంగుల కమలాకర్. తన గురించి అతిగా ఊహించుకుంటున్న ఈటల.. బీసీల గురించి ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్చించారు. కేసీఆర్‌ను దొర అని చెప్పడం సరికాదన్న ఆయన.. టీఆర్ఎస్‌ పార్టీని దెబ్బ తీయడమే ఈటల లక్ష్యమా అని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు ఎదగకుండా ఈటల చేశారని గంగుల కమలాకర్ ఆరోపించారు

మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చాలా బాధేసిందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశాలను గుర్తు చేసిన ఆయన.. రాజకీయ భవిష్యత్తు కల్పించిన కేసీఆర్‌ను ఈటల సవాల్ చేయడం సరికాదన్నారు.

Next Story

RELATED STORIES