Munugode: మునుగోడు ఉపఎన్నిక.. కీలక ఘట్టానికి నేటితో తెర

Munugode: మునుగోడు ఉపఎన్నిక.. కీలక ఘట్టానికి నేటితో తెర
Munugode: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికల ప్రక్రియలో ఇవాళ కీలక ఘట్టానికి తెరడపనుంది.

Munugode: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికల ప్రక్రియలో ఇవాళ కీలక ఘట్టానికి తెరడపనుంది. ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. చివరి రోజు కావడంతో మిగతా పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్ దాఖలు చేయనున్నారు.


ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 11న నామినేషన్ దాఖలు చేయగా.. టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిన్న నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి ఇవాళ పార్టీ నేతల సమక్షంలో నామినేషన్ వేయనున్నారు.

బంగారుగడ్డ నుంచి చండూరు వరకు పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు పాల్వాయి స్రవంతి. ఈ ర్యాలీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొననున్నారు.ఇక మిగతా పార్టీల అభ్యర్థుల కూడా చివరి రోజు కావడంతో నేడు నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది.మునుగోడు ఉపఎన్నికలో ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 100 సెట్ల వరకు నామనేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు నామినేషన్ల ఘట్టానికి తెరపడుతుండటంతో ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి అన్నీ పార్టీలు.ఇక మునుగోడును నేనే దత్తత తీసుకుంటా.. అభివృద్ధి చేస్తా.. ఎన్నికల ముందో మాట, తర్వాతో మాట కాదు. నేను చెప్పే ప్రతి మాటకు కట్టుబడి ఉంటా.. మూడు నెలలకోసారి వస్తా.. స్వయంగా అభివృద్ధి పనులను పరిశీలిస్తా. నా మీద నమ్మకం ఉంచండి. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, తాను కలిసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌.


మరోవైపు బీజేపీ కూడా స్పీడ్‌ పెంచింది. రంగంలోకి జాతీయ నేతలను దింపేందుకు రెడీ అవుతున్నారు.ఈ నెల 29న మునుగోడులో భారీ బహిరంగ సభ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ బహిరంగ సభకుకేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తీసుకురానున్నారు కమలనాధులు.ఇక రేపటి నుంచి బై పోల్‌ ప్రచారంలో రాష్ట్ర అగ్రనేతలు కిషన్‌రెడ్డి,డీకే అరుణ,ధర్మపురి అర్వింద్‌, మురళీధర రావుతో పాటు కేంద్ర మంత్రులు బూపేందర్‌ యాదవ్‌,స్మృతీ ఇరానీ,నిర్మలా సీతారామన్‌ తదితరులు పాల్గొననున్నారు.ఈ నెల18న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రచారంలో పాల్గొనున్నారు మూడు గ్రామాలను ఓ యూనిట్‌గా చేసి ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు.

Tags

Read MoreRead Less
Next Story