ఆస్ట్రేలియాలో తెలంగాణ మ‌హిళ దారుణ హ‌త్య‌..

ఆస్ట్రేలియాలో తెలంగాణ మ‌హిళ దారుణ హ‌త్య‌..
చెత్త‌కుప్ప‌లో దొరికిన శవం

హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఆస్ట్రేలియాలో హత్యకు గురైంది. విక్టోరియాలోని బ‌క్లీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఊరి చివర డస్ట్ బిన్ లో మహిళ మృతదేహం గుర్తించిన పోలీసులు.. మృతురాలు చైతన్య మాధగాని అని గుర్తించారు. చైతన్య హత్యకు గురైన విషయం ఆమె భర్తకు తెలియజేసేందుకు ప్రయత్నించిన పోలీసులకు ఆయన అప్పటికే ఇండియాకు వెళ్లినట్లు తెలియడంతో చైతన్యను ఆమె భర్తే చంపి ఉంటాడా అని అనుమానిస్తున్నారు.

ఆస్ట్రేలియావిక్టోరియాలోని బక్లీలో రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలో ఆదివారం నాడు చైతన్య మాధగాని అలియాస్ శ్వేత అనే హైదరాబాదీ మహిళ మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. స్థానిక విక్టోరియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహిళను హత్య చేసి చెత్త డబ్బాలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్ట్రేలియాలని మిర్కా వే, పాయింట్ కుక్ లోని మహిళ నివాసంలో ఆమె హత్యకు సంబంధించిన ఆధారాలు దొరికాయన్నారు. నేరస్థుడు విదేశాలకు పారిపోయి ఉండొచ్చని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనను హత్యగా భావించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శ్వేత భర్త అశోక్ రాజ్ వరికుప్పల తన కుమారుడితో కలిసి ఇటీవలి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు కుమారుడిని తీసుకుని అశోక్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. అత్త‌గారింట్లో కొడుకుని వ‌దిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసును ద‌ర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు.. అశోక్ రాజే శ్వేత‌ను హ‌త‌మార్చిన‌ట్లు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. చైత‌న్య, అశోక్‌రాజ్‌ల‌ది పెద్ద‌లు కుదిర్చిన వివాహంగా చెబుతున్నారు. ఉపాధా నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉంటున్న అశోక్‌.. ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌ర‌చుగా భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య వివాదాలు వ‌స్తున్నాయ‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం అశోక్ రాజ్‌ను అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం.

అంతకు ముందు రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియాలో లోయలో పడి తెలుగు వైద్యురాలుమృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల మార్చి 2న ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్ హింటర్‌ ల్యాండ్‌లోని లామింగ్టన్ నేషనల్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ యాన్‌ బాకూచి జలపాతం వద్ద ఫొటోలు తీస్తుండగా జారిపడి మరణించింది. ఉజ్వల గతేడాది గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌ చేశారు. జలపాతం వద్ద ఫొటోలు తీస్తున్న సమయంలో తన కెమెరా ట్రైపాడ్‌ను ఒక అంచుపై పడింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో కాలు జారీ లోయ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందింది. ఉజ్వల మృతదేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది ఆరు గంటలకు పాటు శ్రమించారు.

Tags

Read MoreRead Less
Next Story