ఇవాళ్టి నుంచి నాగోబా జాతర

ఇవాళ్టి నుంచి నాగోబా జాతర

ఆదిలాబాద్ జిల్లా (Adilabad District ) ఇంద్రవెల్లి మండలంలోని (Indravelli Mandal) కేస్లాపూర్ లో (Keslapur) నేటి నుంచి మూడురోజులపాటు జరగనుంది. మెస్రం వంశీయులు ఇప్పటికే 220 కిమీ దూరం కాలినడకన వెళ్లి పవిత్ర గోదావరి జలాన్ని తీసకువచ్చారు. ఆ జలంతో ఇవాళ అర్థరాత్రి నాగోబాకు పూజ చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది.

ఈ ఉత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర , చత్తీస్ ఘడ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్, ఏపీ నుంచి కూడా భక్తులు వస్తారు. రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

ముగ్గురు డీఏస్పీల ఆధ్వర్యంలో, ఆరుగురు సీఐలు, 28 మంది ఎస్సైల, 37 మంది ఏఎస్సైలు, 94 మంది హెడ్ కానిస్టేబుళ్లు 94, 243 మంది ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.

Tags

Read MoreRead Less
Next Story