TS Corona Cases: కొత్తగా 427 కరోనా కేసులు

TS Corona Cases: కొత్తగా 427 కరోనా కేసులు
TS Corona Cases: గడిచిన 24 గంటల్లో 87,509 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 427 కొత్త కేసులు నిర్ధారణ

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 87,509 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 427 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు 6,51,715కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,812 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,838కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 609 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,40,065కి చేరింది. పాజిటివి రేటు పూర్తిగా తగ్గిపోయింది. కోలుకున్న వారి రేటు 98.21 శాతంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story