ఆ రోజు వేతనంతో కూడిన సెలవు: సీఎం డిక్లేర్

ఆ రోజు వేతనంతో కూడిన సెలవు: సీఎం డిక్లేర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30న పోలింగ్ తేదీ ఖరారు చేయడంతో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30న పోలింగ్ తేదీ ఖరారు చేయడంతో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగా తెలంగాణ ప్రబుతవం పోలింగ్ జరిగే నవంబర్ 30 వతేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

నవంబర్ 29న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు, కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించామని తెలిపారు. అలాగే డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగే కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికలకు అవసరమైన నిధులు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ ల నిల్వ కోసం ప్రభుత్వం రూ.19.45 కోట్లు విడుదల చేసింది. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రకటనలను, కథనాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story