Omicron in Telangana: కొత్త వేరియంట్.. మూడో స్థానంలో తెలంగాణ

Omicron in Telangana: కొత్త వేరియంట్.. మూడో స్థానంలో తెలంగాణ
Omicron in Telangana: డెల్టా కంటే మూడు రెట్ల వ్యాప్తి సామర్థ్యం ఒమిక్రాన్‌కు వున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది..

Omicron in Telangana: ఎక్కడో యూరప్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు వస్తే మన దేశం వరకు రాలేదు కదా అనుకున్నాం.. మన దేశంలోకి ఈ వేరియంట్‌ ఎంటరైతే మన రాష్ట్రం వరకు వస్తే చూద్దాంలే అనుకున్నాం.. చూస్తుండగానే ప్రమాదం ముంచుకొచ్చింది.. ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతోంది.. ఫారిన్‌ కంట్రీస్‌లో మరణాలు కూడా చూస్తున్నాం.. ఇప్పుడు తెలంగాణకూ ఒమిక్రాన్‌ టెన్షన్‌ పట్టుకుంది.. డెల్టా కంటే మూడు రెట్ల వేగంతో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు..

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 24 కొత్త వేరియంట్‌ కేసులను అధికారులు గుర్తించారు.. సిరిసిల్లలో ఒకటి, హన్మకొండలో ఒకటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో మూడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.. మిగిలిన 19 మంది ఒమిక్రాన్‌ బాధితులు హైదరాబాద్‌ సిటీలోనే ఉన్నారు.. దీనికి తోడు డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు అధికంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.

దేశవ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్ బాధితుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.. అటు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్రం.. జిల్లా, క్షేత్రస్థాయిల్లో కఠిన చర్యలు అనివార్యమని సూచించింది.. తెలంగాణకు కూడా కేంద్రం లేఖ రాసింది.. డెల్టా కంటే మూడు రెట్ల వ్యాప్తి సామర్థ్యం ఒమిక్రాన్‌కు వున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది..

దూరదృష్టితో వ్యవహరించాలని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.. అలాగే కఠినమైన కంటైన్మెంట్‌ అమలు చేయాలని కేంద్రం లేఖలో కీలక సూచనలు చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగానే ఉంది.. 21 లక్షల హోం ఐసోలేషన్‌ కిట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.. థర్డ్‌ వేవ్‌పైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.. మరోవైపు జిల్లా వైద్యాధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు..

మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ప్రజలు భయపడిపోతున్నారు.. ఒక ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్‌కు ఒమిక్రాన్‌ తేలడంతో ఆస్పత్రి సిబ్బంది మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.. ఫారిన్‌ నుంచి వచ్చిన ఒమిక్రాన్‌ బాధితుడికి ఆ డాక్టర్‌ వైద్యం చేయగా.. వైరస్‌ ఆయనకూ సోకింది.. వైరస్‌ నిర్ధారణ కావడంతో ఆయన కాంటాక్ట్స్‌ మొత్తాన్ని క్వారంటైన్‌కు పంపింది ఆస్పత్రి యాజమాన్యం.

Tags

Read MoreRead Less
Next Story