అయ్యో బిడ్డా అప్పుడే ఎల్లి పోయావా.. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి

అయ్యో బిడ్డా అప్పుడే ఎల్లి పోయావా.. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి
ఏడేళ్ల బిడ్డకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయని ఆ తల్లి రోదిస్తోంది. ఓ డ్రైవర్ అజాగ్రత్త ఆ చిన్నారిని పోట్టన బెట్టుకుంది. అమ్మకు కడుపుకోత మిగిల్చింది.

ఏడేళ్ల బిడ్డకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయని ఆ తల్లి రోదిస్తోంది. ఓ డ్రైవర్ అజాగ్రత్త ఆ చిన్నారిని పోట్టన బెట్టుకుంది. అమ్మకు కడుపుకోత మిగిల్చింది. కష్టమైనా కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది. తాత దగ్గరకు వెళతామంటే చాలా జాగ్రత్తలు చెప్పి పంపించింది. ధర్మపురి.. వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన దాసరి హరీశ్(7) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

గ్రామానికి చెందిన దాసరి పోచయ్య-సత్తమ్మకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు హరీశ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. స్కూలు లేకపోవడంతో హరీశ్.. తన పెదనాన్న కొడుకుతో కలిసి తాత దగ్గరకు వెళ్లాడు.. తాత మేకలు కాసేందుకు గ్రామ శివారుకు వెళుతుంటాడు.. అతడి వద్దకు వెళ్లిన పిల్లలని.. ఎండగా ఉంది ఇంటికి వెళ్లిపొమ్మని వారించి పంపించాడు తాత ఇద్దరు మనవళ్లని.

ఇద్దరు చిన్నారులు ఆడుతూ పాడుతూ నడుస్తున్నారు. గ్రామంలో వరంగల్-రాయపట్నం హైవే రోడ్డు దాటే క్రమంలో ధర్మారం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న ఏపీ 01 ఎక్స్ 3483 నెంబర్ గల తూఫాన్ వాహనం హరీశ్‌ను వేగంగా ఢీకొట్టడంతో చిన్నారి హరీశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణవార్త విని బోరున విలపిస్తూ అక్కడికి చేరుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న బిడ్డను చూసి గుండెలవిసేలా రోదించింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story