Hyderabad: పాపం డెలివరీ బాయ్.. పెంపుడు కుక్క వెంట పడేసరికి మూడో అంతస్తు నుంచి..

Hyderabad: పాపం డెలివరీ బాయ్.. పెంపుడు కుక్క వెంట పడేసరికి మూడో అంతస్తు నుంచి..
Hyderabad: ఆర్డర్ ఇచ్చారు.. అరగంటలో వస్తాడని తెలిసి కూడా డోర్ తీయలేదు.. బెల్లు కొట్టేసరి భౌ భౌ అంటూ మీదికి ఉరికి వస్తున్న కుక్కని చూసి భయపడిపోయాడు..

Hyderabad: ఆర్డర్ ఇచ్చారు.. అరగంటలో వస్తాడని తెలిసి కూడా డోర్ తీయలేదు.. బెల్లు కొట్టేసరి భౌ భౌ అంటూ మీదికి ఉరికి వస్తున్న కుక్కని చూసి భయపడిపోయాడు.. మరేం ఆలోచించకుండా మూడో అంతస్తునుంచి దూకేశాడు.. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.. పరీక్షించిన వైద్యులు కండిషన్ క్రిటికల్‌గా ఉందని అంటున్నారు.


ఈ సంఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. రోడ్ నెం.6లోని లుంబిని ర్యాక్ క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న శోభనా నాగాని ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశారు. ఉదయం 9గంటల ప్రాంతంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మహ్మద్ రిజ్వాన్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లి డోర్ కొట్టాడు.



అంతే.. ఇంట్లో నుంచి ఒక్కసారిగా జర్మన్ షెపర్డ్ కుక్క అతడి మీదకు దూకి కరవబోయింది. దీంతో కంగారు పడ్డ రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకునేందుకు పరుగుతీశాడు. కుక్క వెనకే వస్తుందని తెలిసి మూడో ఫ్లోర్ నుంచి దూకేశాడు. కారిడార్ రెయిలింగ్ నుంచి జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.



పెట్ యజమానురాలు దానిని కట్టేయకుండా ఉండడం వల్లే తన సోదరుడికి ఈ పరిస్థితి తలెత్తిందని, ఆమెపై చర్య తీసుకోవాలని బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శోభనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story