తెలంగాణలో..స్కూళ్లు రీ ఓపెన్‌..!

తెలంగాణలో..స్కూళ్లు రీ ఓపెన్‌..!
తెలంగాణలో బడి గంట మోగింది.వేసవి సెలవుల తరువాత స్కూళ్లు రీ ఓపెన్‌ అయ్యాయి.ఈ నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్‌లు పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు.

తెలంగాణలో బడి గంట మోగింది.వేసవి సెలవుల తరువాత స్కూళ్లు రీ ఓపెన్‌ అయ్యాయి.ఈ నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్‌లు పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని బ్యానర్లు, కరపత్రాలతో ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా జరిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంతో పాటు నాణ్యమైన విద్యాబోధన ఉంటుందని అంటున్నారు..

ఇక పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న ప్రత్యేక అవసరాల పిల్లలకు కార్యక్రమాలు, 16న ఇంగ్లీష్ మీడియం పై అవగాహన, 17న బాలికా విద్యతోపాటు కెరీర్‌ గైడెన్స్‌, 19న తెలంగాణ గ్రీన్‌ ఫెస్టివల్‌, 20వ తేదీన విద్యా దినోత్సవం నిర్వహించనున్నారు.తెలంగాణ దశాబ్ధి ఉత్సావాల్లో భాగంగా ఈ నెల 20న తెలంగాణ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతోపాటు పిల్లలు సక్రమంగా పాఠశాలకు రావడంలో సహకరిస్తున్న తల్లిదండ్రులు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరిస్తారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నోట్‌, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందించనున్నారు. అలాగే రాగిజావ కార్యక్రమాన్ని 20వ తేదీన ప్రారంభించనున్నారు.

మరోవైపు తెలంగాణలోనూ వేసవి సెలవులు పొడగించారంటూ ఉత్తర్వులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో దీనిపై తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లకు సెలవులు పొడిగిస్తున్నారనే తప్పుడు వార్తలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నకిలీ ఉత్తర్వులు నమ్మొద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలలకు వేసవి సెలవుల పొడిగింపు లేదని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రీఓపెన్‌ అవుతున్నట్లు ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story