ఎమ్మెల్సీ ఎంపిక పై కేసీఆర్ భారీ కసరత్తు

ఎమ్మెల్సీ ఎంపిక పై కేసీఆర్ భారీ కసరత్తు
హాట్ టాపిక్ గా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక

తెలంగాణలో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక హాట్‌ టాపిక్‌గా మారింది. గులాబీ బాస్‌ ఎవరిని గవర్నర్ కోటాలో శాసన మండలికి పంపుతారు అన్నది ఆసక్తిగా మారింది.అభ్యర్థుల ఎంపికలో భారీ కసరత్తు చేసిన కేసీఆర్ రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య ఏర్పడిన గ్యాప్‌ను ఎలా పూడ్చుతారన్నిది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచి రాజేశ్వరరావు,ముస్లిం మైనార్టీ నుంచి ఫారుక్ హుస్సేన్ పదవీకాలం ముగిసింది.అయితే ఇద్దరికి మళ్ళీ రెన్యువల్ చేసే పరిస్థితి లేదన్న చర్చ పార్టీలో నడుస్తోంది.

మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు గులాబీ బాస్‌ కాస్త ఇబ్బందిగా మారింది.సామాజిక సమీకరణాలు,గవర్నర్ వెంటనే ఆమోదించేలా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.గతంలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని నామినేట్ చేసినప్పుడు వివాదాస్పదమైంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయ రచ్చకు దారి తీసింది. రాష్ట్రంలో అనేక వివాదాలకు కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం కారణమైంది. దీంతో ఇప్పుడు అభ్యర్ధుల ఖరారుపై కేసీఆర్ భారీ కసరత్తు చేస్తున్నారట.ఇప్పటికే మంత్రుల సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే అభ్యర్థుల ఎంపిక చేసిన పేర్లు ఇంకా అధికారకంగా ప్రకటించ లేదు.కేసీఆర్‌ నిర్ణయానికి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసేలా జాగ్రత్తలు పడుతున్నారట.

ఇక సాధారణంగా గవర్నర్ కోటాలో వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని నామినేట్ చేస్తారు.అయితే ఈసారి సర్కార్ నిర్ణయాన్ని గవర్నర్‌ వెంటనే ఆమోదించేలా సీఎం కేసీఆర్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా యువత,విద్యార్థి,మహిళ విభాగాల్లో సామాజిక సేవ చేసిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎలక్షన్‌ ఇయర్‌ కావడంతో రాజకీయ నేపథ్యం ఉన్న వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్‌ కూడా కనిపిస్తోంది. అయితే గతంలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారట.

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీ నుంచి బిక్షమయ్య గౌడ్‌,స్వామిగౌడ్‌,దాసోజు శ్రవణ్‌ తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. అటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా కాషాయ కండువా వదిలి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇటు పార్టీకి పొంగులేటి దూరం కావడంతో తుమ్మల నాగేశ్వరరావు యాక్టీవ్‌ అయ్యేలా కేసీఆర్‌ చర్చలు జరిపారు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరిని ఎంపిక చేయకపోవడంపై కాస్త నిరాశకు గురయ్యారు.ఖాళీ అయిన గవర్నర్ కోటాలో స్థానాల్లో తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు కాకపోతే ఆలేరు లో భిక్షమయ్యకు పాలేరులో తుమ్మలకు తుంగతుర్తిలో మోత్కుపల్లికి అవకాశం కల్పించాలని వారి అనుచరులు డిమాండ్‌ చేస్తున్నారు.మొత్తమ్మీద ఎమ్మెల్సీ అభ్యర్థులపై కేసీఆర్ తుది నిర్ణయం ఎలా ఉండబోతోంది...? గవర్నర్ వెంటనే ఓకే చేస్తారా లేదా తిరకాసు పెడతారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story