Sangareddy: సంగారెడ్డి గురుకుల పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

Sangareddy: సంగారెడ్డి గురుకుల పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Sangareddy: కరోనా టెస్ట్‌లలో నెగిటివ్‌ వచ్చినా అనారోగ్యానికి గురవడంతో ఆందోళన చెందుతున్నారు పాళశాల యాజమాన్యం.

Sangareddy: సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో ఒక్కసారిగా విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురవడం కలకలం సృష్టిస్తోంది. 25 మంది విద్యార్థినులు వాంతులు విరోచనాలతో ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యారు. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికి వారు బాగా నీరసించిపోవడం, అనారోగ్యంతో ఉండడంతో వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురికి పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలుస్తోంది.

నిన్న ఇదే పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారినపడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 43 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మిగతా వారికి ఇవాళ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వారికి నెగెటివ్ వచ్చింది. ఐతే.. కరోనా నెగెటివ్ వచ్చిన వారిలో 25 విద్యార్థినులు వాంతులతో ఆస్పత్రి పాలయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story