Pranit Rao: నేరాన్ని అంగీకరించిన ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు

Pranit Rao:  నేరాన్ని అంగీకరించిన ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు
14రోజుల రిమాండ్

ఇంటిలిజెన్స్ కార్యాలయంలో ఆధారాల ధ్వంసం కేసులో SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని నాంపల్లి నాయముర్తి నివాసంలో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ప్రణీత్‌రావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. విచారణలో ప్రణీత్ రికార్డుల ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ACP వెంకటగిరి నేతృత్వం లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

సంచలనంగా మారిన SIB మాజీ డీఎస్పీ ప్రణీత్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా విచారణలో ప్రణీత్ చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలోని ఆయన నివాసంలో ప్రణీత్‌ను అరెస్ట్ చేశామని...హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారణ ప్రారంభించామనీ పశ్చిమ మండల DCP విజయ్ కుమార్ తెలిపారు. విచారణలో.... ఇతరులతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ ఒప్పుకున్నారన్నారు. కాగా కేసు దర్యాఫ్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బృందంలో ఏసీపీతో పాటు బంజారాహిల్స్ సీఐ, పంజాగుట్ట C.I, మరో ఇద్దరు సైబర్ క్రైం అధికారులు ఉన్నట్లు సమాచారం....SPOT

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు బృందం ఎస్ఐబీలో పరిశీలన జరిపింది. ప్రణీత్‌ను వెంటతీసుకెళ్లి ఆధారాల ధ్వంసం తీరుపై ఆరా తీసింది. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. 42 హార్డ్ డిస్కులు తొలగించడం లేదా ధ్వంసం చేయడంతోపాటు వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చినట్లు గుర్తించింది. అలాగే జనరేటర్ సమీపంలో పలు కీలక పత్రాల్ని కాల్చివేసినట్లు సమాచారం సేకరించింది. ఈనేపథ్యంలో సంఘటన జరిగిన రోజు ప్రణీత్ ఎస్ఐఐబీలో ఏమేమి చేశారనే అంశంపై దర్యాప్తు బృందం ఆరా తీసింది. కొత్తగా అమర్చిన హార్డ్ డిస్క్‌లను ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో వివరాలు అడిగినట్లు తెలిసింది. అయితే సాధారణంగా ఎస్ఐబీలో మావోయిస్టు కార్యకలాపాల గురించి ఆరా తీసే వ్యవస్థ ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మావోయిస్టుల కదలికల గురించి కనిపెడుతుంటారు. ఇందుకోసం ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటెయిల్ రికార్డ్, కాల్ డిటెయిల్ రికార్డ్ విధానాన్ని అనుసరిస్తుంటారు. అవసరమైన పోన్‌కాల్స్ ఇంటర్సెప్ట్ చేసి సంభాషణలు వినేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. అయితే ఏ కాల్ ను ఇంటర్సెప్ట్ చేయాలన్నా తప్పనిసరిగా ఉన్నతస్థాయిలో అనుమతి తీసుకుంటారు. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ.

Tags

Read MoreRead Less
Next Story