ఢిల్లీలో టీకాంగ్రెస్‌ నేతలు బిజీ..బిజీ..

ఢిల్లీలో టీకాంగ్రెస్‌ నేతలు బిజీ..బిజీ..
కాంగ్రెస్‌ పార్టీ పరంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఢిల్లీలో టీకాంగ్రెస్‌ నేతలు బిజీ..బిజీగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీతో వీరు సమావేశం కానున్నారు. పొంగులేటి, జూపల్లితో పాటు అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఆ తరువాత వీరంతా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కానున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లికి వెళ్లారు.

రాహుల్‌తో భేటీ తర్వాత తమ నిర్ణయాన్ని, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు. పొంగులేటి, జూపల్లి.. కాంగ్రెస్‌లో చేరేది లాంఛనమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పొంగులేటి,జూపల్లి అనుచరులు భారీగా ఢిల్లీకి తరలివెళ్లారు.టీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జితో రేవంత్‌,రేణుక సమావేశం అయ్యారు. అటు ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అధిష్టానం పిలుపు రావడంతో ఢిల్లీకి వెళ్లారు. ఇక ఏఐసీసీ మీటింగ్‌ హాల్‌ లో మీడియా సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది. వీటికి సంబందించిన ఏర్పాట్లను పరిశీలించిన టీకాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్యరావ్‌ ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పరిశీలించారు.

Tags

Read MoreRead Less
Next Story