వాణీదేవిని గెలిపించి పీవీని గౌరవించుకున్నారన్నారు : తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

వాణీదేవిని గెలిపించి పీవీని గౌరవించుకున్నారన్నారు : తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. వాణీదేవిని గెలిపించి పీవీని గౌరవించుకున్నారన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. వాణీదేవిని గెలిపించి పీవీని గౌరవించుకున్నారన్నారు. ఈ గెలుపుతో ప్రజలు టీఆర్‌ఎస్‌కే వైపే ఉన్నారని మరోసారి నిరూపించాన్నారు.

హైదరాబాద్‌ - మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సురభివాణీ దేవి, బీజేపీ అభ్యర్ధి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై గెలుపొందారు. నాలుగు రోజుల పాటు ఉత్కంఠ రేపిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించారు. రామచంద్రరావుపై మొదట్నుంచీ వాణీదేవి ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు.

చివరికి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. వాణిదేవీ విజయంతో... టీఆర్‌ఎస్‌ శ్రేణులు సరూర్‌నగర్‌ స్టేడియం వద్ద సంబరాలు చేసుకున్నారు. అటు తెలంగాణ భవన్‌ వద్ద సందడి నెలకొంది. కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వాణిదేవి విజయం సాధించడంతో.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌.




Tags

Read MoreRead Less
Next Story