రేవంత్ కొలువులో మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు

రేవంత్ కొలువులో మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు
డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ఆ రోజే తమ క్యాబినెట్ లోకి తీసుకుంటున్న 11 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు..

డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ఆ రోజే తమ క్యాబినెట్ లోకి తీసుకుంటున్న 11 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.. ఈ రోజు వారికి శాఖలను కేటాయించారు. ఇందుకోసం శుక్రవారం దిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో సుదీర్ఘచర్చలు జరిపారు.

అనంతరం మంత్రుల శాఖలపై ఒక క్లారిటీకి వచ్చిన సీఎం శనివారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఆయా శాఖలను కేటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు. హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను ప్రస్తుతానికి తన వద్దే ఉంచుకున్నారు. భవిష్యత్తులో వాటి గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం శాఖలు కేటాయించిన మంత్రుల వివరాలు..

భట్టి విక్రమార్క.. ఆర్థిక, ఇంధన శాఖ

తుమ్మల నాగేశ్వరరావు .. వ్యవసాయం, చేనేత

జూపల్లి కృష్ణారావు .. ఎక్సైజ్, పర్యాటకం

ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నీటి పారుదల, పౌరసరఫరాలు

దామోదర రాజనర్శింహ.. వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ

కోమటి వెంకట్ రెడ్డి.. ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ

దుద్ధిళ్ల శ్రీధర్ బాబు.. ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ

పొన్నం ప్రభాకర్.. రవాణా, బీసీ సంక్షేమం

సీతక్క.. పంచాయతీ రాజ్, మహిళా సంక్షేమం

కొండా సురేఖ.. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ

Tags

Read MoreRead Less
Next Story