TS RESULT: శాసనసభకు పది మంది మహిళలు

TS RESULT: శాసనసభకు పది మంది మహిళలు
రాజకీయ ఉద్ధండులకు షాక్‌ ఇచ్చిన యువత.... 30 ఏళ్లు నిండని యువత అసెంబ్లీకి

కష్టపడితే ఏ రంగంలోనైనా విజయం సాధ్యమేనని తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మహిళలు, యువతరం నిరూపించారు. ఈసారి ఎన్నికల్లో గెలిచిన యవత, డాక్టర్లు సహా 10మంది మహిళలు విజయకేతనం ఎగురవేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. అందులో నిండా ముప్పై ఏళ్లు కూడా లేని యువజనులు ఉన్నారు. సీనియర్ నాయకులను, మంత్రులను ఓడించి జయభేరి మోగించారు. మెదక్‌ నియోజకవర్గంలో సీనియర్‌ నాయకులు పద్మా దేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు గెలుపొందారు. MBBS పూర్తి చేసిన రోహిత్‌... సామాజిక సేవలో ముందున్నారు. ఫౌండేషన్ ద్వారా కరోనా వంటి విపత్కర సమయంలో రోహిత్‌రావు సేవ చేశారు. నారాయణపేట విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి పర్ణికారెడ్డి వయసు 30 ఏళ్లు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నా... తొలిసారే పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పర్ణికారెడ్డి... డీకే అరుణ మేనకోడలు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత తొలిసారి బీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలిచి కంటోన్మెంట్‌లో విజయం సాధించారు.


వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్‌, రామగుండం నుంచి రాజ్‌ఠాగూర్‌, నాగార్జునసాగర్‌ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్‌మోహన్‌రావు, తుంగతుర్తి నుంచి మందుల శ్యామూల్‌, మల్కాజిగిరి నుంచి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి, వరంగల్‌ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్‌ రెడ్డి, వర్ధన్నపేట నుంచి కేఆర్‌ నాగరాజు .. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఈసారి వైద్యులు సైతం సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 మంది వైద్యులు ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున 11మంది, బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక డాక్టర్‌ విజయం సాధించారు. డోర్నకల్‌ నుంచి డాక్టర్ రాంచంద్రనాయక్, అచ్చెంపేటలో డాక్టర్ వంశీ కృష్ణ, మహబూబాబాద్‌లో మురళీ నాయక్, మానకొండూరులో డాక్టర్ సత్యనారాయణ, మెదక్‌లో మైనంపల్లి రోహిత్, నారాయణపేటలో డాక్టర్‌ చిట్టెం పర్ణిక, నారాయణఖేడ్‌లో డాక్టర్ సంజీవ్ రెడ్డి, చెన్నూరులో డాక్టర్ వివేక్‌ వెంకటస్వామి, నిజామాబాద్‌ రూరల్‌లో భూపతిరెడ్డి, సత్తుపల్లిలో డాక్టర్‌ రాగమయి, నాగర్‌కర్నూల్‌లో కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, కోరుట్లలో డాక్టర్‌ సంజయ్, జగిత్యాలలో డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, సిర్పూర్‌లో పాల్వాయి హరీశ్‌బాబు విజయదుంధుబి మోగించారు. వీరంతా వివిధ విభాగాల్లో డాక్టర్లుగా సేవలు చేశారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 10మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. సబితా ఇంద్రారెడ్డి , కొండా సురేఖ, వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సీతక్క, పద్మావతిరెడ్డి, కోవా లక్ష్మి, మామిడ్యాల యశశ్విని, చిట్టెం పర్ణికా రెడ్డి, లాస్య నందిత, మట్టా రాగమయి జయభేరి మోగించారు.

Tags

Read MoreRead Less
Next Story