TS EAMCET: తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్..

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్..
ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్‌టీయూహెచ్‌లో విడుదల చేశారు.

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్‌టీయూహెచ్‌లో విడుదల చేశారు. ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థుల ఫలితాలను కూడా నేడు విడుదల చేశారు.

ఫలితాలు ఈ విధంగా చెక్ చేసుకోవాలి: ముందుగా ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inని ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్‌లో TS EAMCET result 2021 లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. చివరిగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి ఫలితాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌, మెడికల్‌ విద్యార్థుల ఫలితాలను కూడా విడుదల చేశారు.

ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులను కౌన్సిలింగ్‌కి పిలుస్తారు. ఈనెల 30 నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు ఆగస్టు 30 నుంచి సెప్గెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.

సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సిలింగ్ తేదీలను ఇంకా వెల్లడించలేదు.

Tags

Read MoreRead Less
Next Story