సాయిచంద్ భార్యకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి

సాయిచంద్ భార్యకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాయిచంద్ మృతితో యావత్ తెలంగాణ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట ఉంటూ.. పార్టీలో చురుగ్గా పాల్గొని అందరి మన్ననలు పొందిన సాయి.. ఆకస్మిక మృతి అందరినీ కంటతడి పెట్టించింది. ఇక సాయిచంద్ భార్య రజనీకి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రజనీని నియమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే కుసుమ జగదీష్, సాయి చంద్ కుటుంబాలకు మంత్రులు తమ ఒక నెల జీతం మూడు కోట్ల రూపాయలను జగదీష్, సాయి చంద్ కుటుంబాలకు అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

సాయిచంద్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు రజనీని కలుసుకున్నారు. 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు చరిష్, కుమార్తె నాది ఉన్నారు. తండ్రిలాగే ప్రజా సమస్యలపై పాటలు రాస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తన పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. 2009 నుంచి 2023 వరకు అసెంబ్లీకి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 15, 2021 న సాయిచంద్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. డిసెంబర్ 24, 2021 న కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

జూన్ 28, 2023 న అతను తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. అక్కడ అర్ధరాత్రి గుండెపోటుకు గురవడంతో కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన నాగర్ కర్నూల్‌లోని గాయత్రి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో, అతన్ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 29, 2023 తెల్లవారుజామున 3 గంటలకు సాయిచంద్ మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story