తెలంగాణ

AP_Telangana : ఏపీ- తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం..!

AP_Telangana : ఏపీ- తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం తలెత్తింది. ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చే ధాన్యం లారీలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు.

AP_Telangana : ఏపీ- తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం..!
X

Lorry (File Photo)

AP_Telangana : ఏపీ- తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం తలెత్తింది. ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చే ధాన్యం లారీలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని టోల్‌గేట్ల వద్దనే ధాన్యం లారీలను ఆపేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరితో తీవ్రంగా నష్టపోతామని ఏపీ వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వ అనధికార ఆదేశాలతో ఏపీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు భయపడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ధాన్యాన్ని నిల్వ చేయడం రైతులకు కష్టంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ సర్కార్‌ చర్చించి, సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Next Story

RELATED STORIES