Peddapalli: పురాతన అద్భుత కట్టడం ఆ దేవాలయం.. కానీ అందులో దేవుడు లేడు.. ఎక్కడో తెలుసా?

Peddapalli: పురాతన అద్భుత కట్టడం ఆ దేవాలయం.. కానీ అందులో దేవుడు లేడు.. ఎక్కడో తెలుసా?
Peddapalli: పురాతన దేవాలయాలు పవిత్రతకు ప్రతీకలు.. అద్భుత శిల్పకళానైపుణ్యాన్ని వీక్షించడానికి, అందులో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు.

Peddapalli: పురాతన దేవాలయాలు పవిత్రతకు ప్రతీకలు.. అద్భుత శిల్పకళానైపుణ్యాన్ని వీక్షించడానికి, అందులో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. కానీ ఇక్కడి ఆలయానిక ఆ భాగ్యం లేదు.. అమ్మవారి ప్రతిష్ట జరగలేదు. ఆలయం కట్టనైతే కట్టారు కానీ దేవతా మూర్తిని నిలపలేదు.

తెలంగాణలోని కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో ఈ అద్భుతమైన ఆలయం ఉంది. శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో కొన్ని కారణాల వల్ల విగ్రహ ప్రతిష్ట జరగలేదు. ప్రభుత్వాలు మారుతున్నా పట్టించుకునే నాధుడు లేక ఆ ఆలయం అమ్మవారు లేని ఆలయంగా మిగిలిపోయింది. అయితే ఈ ఆలయం మంచి షూటింగ్ స్పాట్‌గా మారింది.

నిత్య దీపారాధనలు, భక్తుల కోలాహలం లేని ఈ దేవాలయం ఊరి చివర విసిరివేసినట్లుగా ఉంటుంది. అండాళ్లమ్మ అమ్మవారి కోసం ఈ గుడి కట్టినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. శతాబ్ధాల క్రితమే ఎంతో అద్భుత్ంగా నిర్మించిన ఈ ఆలయం ప్రస్తుతం కొంత శిధిలావస్థకు చేరుకున్నా రూపురేఖలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆలయ గోపురం, అద్భుతంగా చెక్కిన శిల్పాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికీ. గర్భగుడికి ఇరుపక్కల దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు, మండపం నిర్మించారు. మండపానికి కొద్ది దూరంలో ఆలయానికి మరింత శోభను తీసుకొచ్చే విధంగా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు.

ఆండాళ్లమ్మ ఆలయ నిర్మాణానికి అప్పటి రాఘవపూర్ గ్రామ సంస్ధానాదీశుడు ఎరబాటి లక్ష్మీనరసింహారావు, ఆయన కుమారుడు లక్ష్మీ్కాంతరావు అంకురార్పణ చేశారు. రంగనాయకస్వామి ఆలయం నుంచి 500 మీటర్ల దూరంలో గుట్టకు సమీపంలో ఆలయం నిర్మించారు.

ఏటా నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి ప్రతిపాదిత రోప్ వే ద్వారా అమ్మవారిని రంగనాయకస్వామి ఆలయానికి తీసుకొచ్చి కళ్యాణం నిర్వహించాలన్న ఆలోచన కొన్నేళ్ల క్రితం చేశారు. అయితే రోప్ వే నిర్మించేందుకు ఇంజనీర్లు రాకపోవడంతో గుడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిలిచిపోయింది.

పగలు షూటింగ్ స్పాట్‌గా, సాయింత్రం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది ఈ ఆలయ ప్రాంగణం. ఆలయ సమీపంలోని ఖాళీ స్థలంలో వివిధ రకాల పూలమొక్కలతో ఆలయ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తుంది. దాంతో సినిమా షూటింగులు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, షార్ట్ ఫిలిమ్స్ చేసుకోవడానికి కేంద్రంగా మారింది.

ఆదరణకు నోచుకోని ఈ ఆలయానికి ఆధ్యాత్మిక శోభ తేవాలని, పుణ్యక్షేత్రంగా మారాలని భక్తులు కోరుకుంటున్నారు. అమ్మవారి అనుగ్రహిస్తే ఆరోజు త్వరలోనే వస్తుందని స్థానికులు విశ్వసిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story