KCR : టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించిన సీఎం కేసీఆర్
TRS : తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అధినేత కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

KCR (tv5news.in)
TRS : తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అధినేత కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామాల నుంచి జిల్లాల వరకు అన్నింటా టీఆర్ఎస్ పటిష్టంగా ఉండేలా బలమైన నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. అన్ని జిల్లాలకు పార్టీ నూతన అధ్యక్షులను నియమించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లాల అధ్యక్షులను కేసీఆర్ నియమించారు. టీఆర్ఎస్ జిల్లాల ప్రెసిడెంట్ల జాబితాలో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే జోగు రామన్నను నియమించారు అధినేత కేసీఆర్. అలాగే కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాకు కోనేరు కోనప్ప, మంచిర్యాల జిల్లాకు బాల్క సుమన్, నిర్మల్ జిల్లాకు జి. విఠల్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు ఏ. జీవన్‌రెడ్డి, కామారెడ్డి జిల్లాకు మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ యం.కే. ముజీబుద్దీన్, కరీంనగర్ జిల్లాకు సుడా ఛైర్మన్ జి.వి. రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్లా జిల్లాకు మాజీ ఎంపీపీ తోట ఆగయ్య, జగిత్యాల జిల్లాకు కె. విద్యాసాగర్, పెద్దపల్లి జిల్లాకు కోరుకంటి చందర్, మెదక్ జిల్లాకు యం. పద్మా దేవెందర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లాకు చింతా ప్రభాకర్, సిద్ధిపేట జిల్లాకు కొత్త ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు అరూరి రమేష్, హన్మకొండ.. దాస్యం వినయ్‌భాస్కర్, జనగామకు జెడ్పీ ఛైర్మన్ పి. సంపత్‌రెడ్డి,
మహబూబాబాద్ జిల్లాకు మాలోతు కవిత నాయక్, ములుగు జిల్లాకు జెడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు జెడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి, ఖమ్మం జిల్లాకు తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రేగా కాంతారావు, నల్లగొండ జిల్లాకు రమావత్ రవీంద్రకుమార్, సూర్యాపేట జిల్లాకు బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్ జిల్లాకు డాక్టర్ మెతుకు ఆనంద్, మేడ్చల్ జిల్లాకు శంభీపపూర్ రాజు, మహబూబ్‌నగర్ జిల్లాకు సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ - గువ్వల బాలరాజు, జోగులాంబ గద్వాల - బి.కృష్ణమోహన్‌రెడ్డి, నారాయణపేట - ఎస్. రాజేందర్‌రెడ్డి, వనపర్తి జిల్లాకు మున్సిపల్ ఛైర్మన్ ఏర్పుల గట్టుయాదవ్, హైదరాబాద్ జిల్లాకు మాగంటి గోపినాథ్‌కు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు అధినేత, సీఎం కేసీఆర్.
RELATED STORIES
LIC IPO : స్టాక్ మార్కెట్ లో లిస్టు అయిన ఎల్ఐసీ..!
17 May 2022 6:00 AM GMTGold and Silver Rates Today : స్ధిరంగానే బంగారం, షాకిచ్చిన వెండి......
17 May 2022 12:45 AM GMTCrossbeats: ఒక్కసారి ఛార్జింగ్ తో 15 రోజులు.. సరికొత్త స్మార్ట్ వాచ్
16 May 2022 12:00 PM GMTGold and Silver Rates Today : స్ధిరంగానే బంగారం,వెండి ధరలు..మార్కెట్లో ...
16 May 2022 12:45 AM GMTProperty Sales: గ్రేటర్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న గృహాలు
14 May 2022 10:45 AM GMTGold and Silver Rates Today: గుడ్ న్యూస్..! బంగారం, వెండి ధరల్లో...
14 May 2022 12:53 AM GMT