బిగ్ బ్రేకింగ్..సీఎం మార్పు ఊహాగానాలపై కేసీఆర్ స్పష్టత

బిగ్ బ్రేకింగ్..సీఎం మార్పు ఊహాగానాలపై కేసీఆర్ స్పష్టత
ముగిసిన TRS రాష్ట్ర కార్యవర్గ సమావేశం

CM మార్పు విషయంలో ఊగాహానాలకు తెర దించుతూ మరోసారి స్పష్టత ఇచ్చారు KCR. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, మరో 10 ఏళ్లపాటు CMగా తానే ఉంటానని అన్నారు. TRS రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యనేతలకు భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో.. ఇటీవల కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ సభ్యత్వ నమోదు సహా అన్నింటిపైన చర్చించారు. కొందరికి వార్నింగ్‌లు ఇస్తూనే.. ఇకపై CM మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని దానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చెప్పేశారు.

ఇవాళ్టి మీటింగ్ అజెండాలో లేకపోయినా CM మార్పు అంశం చర్చకు వస్తుందనే ప్రచారం TRS వర్గాల్లో జోరుగానే జరిగింది. ఐతే.. మీటింగ్‌లో ఈ అంశాన్ని లేవనెత్తేది ఎవరు అనే దానిపై కూడా రకరకాల చర్చలు జరిగాయి. ఐతే.. KTRను సీఎం చేసే విషయంలో ప్రస్తుతం వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ KCR తానే సీఎంగా కొనసాగుతానని ప్రకటించారు. నోరు జారుతున్న నేతలకు సీరియస్‌ వార్నింగ్ ఇస్తూనే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరికలు చేశారు. టీఆర్‌ఎస్‌కు ఎవరూ పోటీ కాదని స్పష్టం చేశారు. త్వరలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.

ఏప్రిల్‌లో టీఆర్ఎస్‌ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు CM కేసీఆర్ స్పష్టం చేశారు. అప్పటికల్లా సభ్యత్వ నమోదు విషయంలో టార్గెట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇక నాగార్జున సాగర్‌ బైపోల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు గులాబీ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్లీనరీ సమావేశాలు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై చర్చించాక.. ముఖ్యమైన అంశాలపై సూచనలు కూడా చేశారు. నియోజకవర్గానికి 50వేలకు తగ్గకుండా సభ్యత్వాలు ఉండాలని చెప్పారు. GHMC మేయర్ అభ్యర్థిని...11న ఉదయం సీల్డ్‌కవర్‌లో పంపిస్తానన్నారు కేసీఆర్. పార్టీ ప్రతిపాదించిన పేరుని అందరూ సమర్థించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ నెల 12 నుంచి TRS సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని కూడా ఆదేశించారు.



Tags

Read MoreRead Less
Next Story