TRS : ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

TRS : ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
TRS : తెలంగాణలో వరి రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ-కమలం పార్టీల మధ్య మాటలయుద్ధం మరింత ముదురుతోంది.

TRS : తెలంగాణలో వరి రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ-కమలం పార్టీల మధ్య మాటలయుద్ధం మరింత ముదురుతోంది. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి ప్రదర్శిస్తుందంటూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది టీఆర్ఎస్. అన్ని జిల్లాల్లో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం విజయవంతం కావడంతో ఇపుడు ఢిల్లీ వేదికగా వరిపోరు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

ఇవాళ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆపార్టీ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరుకానున్న ఈ కీలక సమావేశంలో రాష్ట్రంలో వరి ధాన్యం కొనగోళ్లు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిపై చర్చించనున్నారు. అదేవిధంగా రైతులను, ప్రజలను బీజేపీ అయోమయానికి గురి చేస్తున్న తీరుతెన్నులపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు.

అలాగే కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయం, రాష్ట్ర బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక తీరు.. రాష్ట్ర బీజేపీ మరో తీరు వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారనేది టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా రైతుదీక్ష లేదా ధర్నా చేపట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇవాళ జరిగే శాసనసభాపక్ష సమావేశంలో దేశరాజధానిలో తలపెట్టే పోరాట ఎజెండాను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ స్థాయి ఆందోళనతో పాటు రాష్ట్రంలో ఏఏ రూపంలో ఆందోళనలు కొనసాగించాలన్న అంశాలపైనా కేసీఆర్ వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో పండించే వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర స్పష్టతనిచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు ఢిల్లీ వేదికగా కేంద్రంపై వరియుద్ధం చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వరి రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story