నేను ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి.. వద్దు అనుకుంటే అదే ఉత్తరంతో తప్పిస్తాం: ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య
యోజకవర్గ పరిధిలోని ఎమ్మార్వో, ఎస్సై, ఎంపీడీవో అధికారులు ఎవరైనా.. తాను ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి వస్తారని బొల్లం మల్లయ్య అన్నారు.

X
bollam mallaiah yadav (File Photo)
Vamshi Krishna20 Feb 2021 11:43 AM GMT
కోదాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారుల పోస్టింగులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మార్వో, ఎస్సై, ఎంపీడీవో అధికారులు ఎవరైనా.. తాను ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి వస్తారని బొల్లం మల్లయ్య అన్నారు. వద్దు అనుకుంటే అదే ఉత్తరంతో వారిని తప్పిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశిష్ట అధికారాలతో వీరందిరితో పని చేయించుకోవచ్చని అధికారం మన చేతుల్లో ఉందని బొల్లం మల్లయ్య మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే గతంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇంటర్నల్ మీటింగ్‌లో మాట్లాడిన వీడియోగా ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Next Story