TRS Plenary 2021: ప్లీనరీలో ప్రపంచ రికార్డుకు టార్గెట్.. కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

TRS Plenary 2021 (tv5news.in)

TRS Plenary 2021 (tv5news.in)

TRS Plenary 2021: గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. ప్లీనరీలో ప్రపంచ రికార్డును నెలకొల్పే లక్ష్యంగా సిద్ధమవుతుంది.

TRS Plenary 2021: గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. ప్లీనరీలో ప్రపంచ రికార్డును నెలకొల్పే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా రేపు నిర్వహించే ప్లీనరీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కోట ద్వారాన్ని తలపించేలా 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులు ఇలా దాదాపు 15 వేల మంది వస్తారని అంచనా. ఇందుకు తగ్గట్టుగా సదుపాయాలు సమకూర్చుతున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్ని తానే భుజాన వేసుకుని పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్‌ మొదలు, సభా వేదిక దాకా అన్నింటిని మంత్రి కేటీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో సీఎం కేసీఆర్‌ నిలువెత్తు కటౌట్లు ఆకర్షిస్తున్నాయి. పలు కూడళ్లలో సీఎం కేసీఆర్‌ ఫొటోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. జంక్షన్లలో తోరణాలు కడుతున్నారు. మొత్తంగా గ్రేటర్‌ గులాబీమయమైంది. ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేవారి కోసం 50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్న భోజనంలో 29 రకాల ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయనున్నారు. ఆహ్వాన పాసులు కూడా ఇప్పటికే చాలా మందికి అందించడం పూర్తయ్యింది. నగర ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్లీనరీ సభకు వచ్చే పురుష ప్రతినిధులు గులాబీ రంగు చొక్కాలు, మహిళలు గులాబీ రంగు చీరలు ధరించి రావాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

ఈ రోజూ సాయంత్రం వరకు ప్రాంగణం సిద్ధమవుతుందని.. ప్రతినిధులు రేపు ఉదయం 10 గంటల వరకు ప్లీనరీ సభా ప్రాంగణానికి చేరుకునేలా నియోజకవర్గ ఇంఛార్జీలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఒంటిగంట వరకు మొదటి సెషన్, ఆ తర్వాత లంచ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్లీనరీ రెండో సెషన్, ఆ తర్వాత ఏడు అంశాల మీద తీర్మానం ఉంటుంది. సీఎం కేసీఆర్‌ను... పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story