తెలంగాణలో రెండు లక్షలకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1949 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్షా 99 వేలు దాటిందని.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. శనివారం ఇక్క రోజులో కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11 వందల 63కి చేరింది.
కరోనా నుంచి కోలుకుని శనివారం ఒక్క రోజులో 2 వేల 366 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా 70 వేల 212 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27 వేల 901 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో కొత్తగా 291 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్‌లో 150 కొత్త కేసులు నమోదయ్యాయి.. నల్గొండలో 124, కరీంనగర్‌లో 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com