TSRTC: అమ్మమ్మ, తాతయ్యలకు టీఎస్ఆర్టీసీ ఉగాది కానుక..

TSRTC: అమ్మమ్మ, తాతయ్యలకు టీఎస్ఆర్టీసీ ఉగాది కానుక..
TSRTC: 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్నది సజ్జనార్.. ఆయన ఐడియాలజీ వినూత్నంగా ఉంటుంది.. ఎక్కడ ఉన్నా తన మార్క్ కచ్చితంగా చూపిస్తారు. ప్రయాణీకులు ఎంతో కొంత మేలుచేయాలని.. ఆర్టీసీకి పూర్వవైభవాన్ని తీసుకువరావాలని తాపత్రయ పడుతుంటారు.. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంటారు..


తాజాగా ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని సీనియర్ సిటిజెన్స్ కోసం ఓ అవకాశం కల్పించారు. పండుగ రోజు తెలంగాణకు చెందిన అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఉచిత ప్రయాణం కోసం సీనియర్ సిటిజన్లు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story