TS: ఇక నుంచి ఏసీ బస్సుల్లోనూ శ్రీశైలం వెళ్లొచ్చు..

TS: ఇక నుంచి ఏసీ బస్సుల్లోనూ శ్రీశైలం వెళ్లొచ్చు..

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త. అక్కడికి వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆర్టీసీ కొత్త ప్రయాణాన్ని అందించనుంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఏసీ బస్సులు లేవు. నాన్-ఏసీ బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. కానీ తాజాగా టీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో ఆ కల నెరవేరబోతోంది. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య 10 ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కొత్తగా 85 బస్సులను ప్రవేశపెట్టనుంది. 75 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 10 ఏసీ బస్సులు శ్రీశైలం వెళ్లే ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి.

ఇప్పుడిప్పుడే ఎండాకాలం ప్రారంభమవుతోంది. ఈ సమయంలో ఏసీ బస్సులు అందుబాటులోకి రానుండటం ప్రయాణికులకు తీపి కబురుగా తోస్తోంది. 'రాజధాని' బస్సు పొడవు ఎక్కువ ఉండటం వల్ల ఘాట్‌ రోడ్ల మలుపుల్లో తిరగడం కష్టం. దీంతో సూపర్‌లగ్జరీ బస్సులతోనే ఇన్నాళ్లు సరిపెట్టింది. తాజాగా- ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్‌ లగ్జరీ బస్‌ బాడీలోనే రాజధాని బస్సును తయారు చేయించారు.

Tags

Read MoreRead Less
Next Story